పాత్రికేయులపై దాడికి నిరసన

Feb 21,2024 23:59

ప్రజాశక్తి – సంతమాగులూరు
పాత్రికేయులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని ఏపీడబ్ల్యూజే నాయకులు బలుపులూరి కృష్ణారెడ్డి అన్నారు. రాప్తాడులో సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి విలేఖరిపై వైసీపీ మూకలు దాడి చేసి గాయపరచడాన్ని, కర్నూలు ఈనాడు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఇలాంటి దాడులను ప్రోత్సహించడం మంచిది కాదన్నారు. సిఎం సభలోనే పాత్రికేయులకు భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దారు టీ ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాత్రికేయులు ఓర్సు కొండలు, కోటేశ్వరరావు, సుబ్బారావు, ఆంజనేయులు, కాలేషా, సుబ్బారావు, నాగూర్ పాల్గొన్నారు.

➡️