కుక్కలు, కోతుల నుండి కాపాడండి

Mar 1,2024 15:29 #Anantapuram District

ప్రజాశక్తి-పుట్లూరు : అరకటవేముల గ్రామంలో కుక్కల నుంచి కోతుల నుంచి గ్రామంలోని వృద్ధులను పిల్లలను కాపాడండి అని సిపిఐ మరియు కుక్క కాటుకు గాయపడిన వారి ఆధ్వర్యంలో సచివాలయంలో శుక్రవారం కార్యదర్శి కి వినతిపత్రం అందించారు. అనంతరం మండల సిపిఐ   కార్యదర్శి డి పెద్దయ్య మాట్లాడుతూ.. అరకటవేముల గ్రామంలో ఈమధ్య కుక్కలు, కోతులు ప్రజలపై దాడి చేయడం జరుగుతున్నది. గురువారం రాత్రి ఇద్దరినీ శుక్రవారం ఉదయం మరో ముగ్గురిని ఏకంగా ఐదు మందిని కుక్కలు పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగినది. ఇలా దాడి జరిగితే గతంలో కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయిన అయినా ప్రభుత్వం అధికారులు ఎలాంటి చలనం లేదు. ఉదయం పూట చిన్నపిల్లలు అంగడి వాడి కి, స్కూల్ పిల్లలు పోవాలంటే వారి ప్రాణాలు అరిచితులో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఎక్కడ కుక్కలు దాడి చేస్తాయని భయపడుతూ పిల్లలు అంగంవాడి బడికి, అలాగే స్కూల్ కి పోతున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా కుక్కలు కోతులు ఎక్కడ మా పిల్లలపై దాడి చేస్తాయని బడికి పంపించాలని భయపడుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు కాకుండా పిల్లలపై దాడి జరగక ముందే ముందస్తుగానే
ప్రభుత్వం స్పందించి గ్రామంలో ఉన్న కుక్కలను కోతులను ప్రభుత్వం ద్వారా వాటిని పట్టుకొని అడవుల్లో వదలాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)గా ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. కావున మరొకసారి ఇలాంటి కుక్కలతో గాని కోతులు గాని దాడి జరిగినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. గ్రామ శాఖ కార్యదర్శి ఓబుళపతి, పెద్ద కొండయ్య, ఆదిశేషు ,ఆదెన్న , గురపరెడ్డి గండి ఆంజనేయ, కుక్క కాటుకు గాయపడిన బాధ్యులు, అంజనమ్మ, అంకాలమ్మ, సౌజన్య ,నాగ మునయ్య వెంకటరాముడు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

➡️