ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : సిఐటియు

ప్రజాశక్తి సూళ్లూరుపేట (తిరుపతి) : రాష్ట్ర మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ పిలుపుమేరకు మంగళవారము నుండి సూళ్ళూరుపేట మున్సిపల్‌ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కార్మికులను పర్మినెంట్‌ చేయాలని అప్కాస్‌ పర్మినెంట్‌ ఉద్యోగులుగా జీతభత్యాలు లీవ్‌ ఎన్కాషమెంటు గ్రాట్యుటీ పెన్షను కార్మికులందరికీ హెల్త్‌ అలవెన్స్‌ ప్రకటించాలని,కరోనా టైములో పని చేసిన వారిని పనిలో కొనసాగించాలని,క్లాప్‌ డ్రైవర్లకు రూ.18500/- నెల వేతనము ఇవ్వాలని, కార్మికులందరికీ అదాయ పరిమితితో ప్రమేయము లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని పట్టణ పెరుగుదలకు అనుగుణంగా కార్మికులను పెంచాలన్నారు. సమ్మెకు సిఐటియు గౌరవ అధ్యక్షులు కె.సాంబశివయ్య, బి.పద్మనాభయ్య, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, కె.లక్ష్మయ్య, సిఐటియు నాయకులు చంద్రశేఖర్‌, పి.మనోహర్‌ యుటియఫ్‌ నాయకులు రాజశేఖర్‌, ప్రభాకర్‌ బాబు తదితరులు తమ సంఘీభావము ప్రకటించారు.

➡️