పురోగతే!

Apr 13,2024 20:56 #పురోగతే!

ఇంటర్‌ ఫలితా ల్లో ఆశించిన పురోగతి కొరవడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కడప, అన్నమయ్య జిల్లాలు 22, 23వ స్థానాల్లో నిలిచిన నేపథ్యం స్వల్ప ఉపశమనాన్ని కలిగించింది. ఆశించిన ఫలితం సాధించలేదనేది కఠిన వాస్తవం. జిల్లాల పున ర్విభజన నేపథ్యంలో విద్యార్థులపై కేంద్రీకరణ పెరుగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగిందని చెప్ప వచ్చు. కడప, అన్నమయ్య జిల్లాలు వరుస స్థానాలను సాధిం చడం ఆసక్తిని కలిగించింది. ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ముఖ్య మంత్రి జగన్‌ సొంత జిల్లాలో ఉత్తమ ఫలితాలను రాబట్టు కోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. రెగ్యులర్‌ ఆర్‌ఐఒలను నియమించకపోవడం, టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల తరహా వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా సీరియస్‌ వాతావరణాన్ని ఏర్పరిచి ఉండాలి. ఇటువంటి ప్రయత్నమేదీ చేయలేదని చెప్ప వచ్చు. ఎఫ్‌ఎసి పద్ధతిలో ఆర్‌ఐఓను నియమిం చడాన్ని పరి శీలిస్తే ఇంటర్‌ విద్యాశాఖ సీరియస్‌గా తీసుకోలేదనే విషయం వెల్లడవుతోంది. ఇటువంటి నిర్లక్ష్య వాతావరణంలో ఇంతకు మించి ఫలితాన్ని సాధించడం ఎవరికీ సాధ్యం కాదని చెప్ప వచ్చు. దీనిపై గతంలో ఆర్‌ఐఒలను సంప్రదిస్తే విజయవాడ, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు ఉత్తమ విద్యార్థులు (క్రీమ్‌) వెళ్లి పోయిందని, తద్వారా ఇంతకు మించిన ఉత్తీర్ణత సాధించడం కష్టమనే సమాధా నం లభించేది. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల తరహాలో ఇంటర్‌ విద్యార్థులపై ప్రత్యేకదృష్టి సారించడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాన్ని ప్రస్తావిస్తే సమాధానం లభించడం లేదు. ప్రస్తుత ఏడాది జూనియర్‌ ఇంటర్‌లో 55 శాతం, సీని యర్‌ ఇంటర్‌లో 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది టెన్త్‌ ఉత్తీర్ణతను పరిశీలిస్తే 85 శాతం పైగా సాధించారు. ఇంటర్‌లో ఎందుకు ఫలితాలు రావడం లేదో జిల్లా, రాష్ట్ర ఉన్న తాధికారులు ఆలోచించుకోవాలి. ఈయే డాది ఇంటర్‌ విద్యా శాఖ జయీభవ అనే కార్యక్రమాన్ని తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించామని చెబుతున్న అధికారులు, ఇంతకు మించిన ఫలితాలు సాధించ డానికి ఎటువంటి వ్యూహాన్ని అవలంభించాలో ఆలోచించాల్సిన అవ సరం ఉంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో అట్టడుగు స్థానాల నుంచి రెండవ స్థానంలో కడప, అన్నమయ్య జిల్లాలు నిలు స్తున్నాయి. దిగువ స్థాయి గణాంకాలను తలకిందులు చేయాల్సిన రోజులు ఎప్పటికి సిద్ధిస్తాయో వేచి చూడాల్సి ఉంది. తాజా ఇంటర్‌ ఫలితాలు అంకెల్లో చెప్పుకోవడానికి రెండు మెట్లు పైకి ఎక్కడం మినహా ఆశించిన పురోగతి సాధించక పోవడం ఆందోళన కలిగించింది. ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ 2025 నాటికి మరింత మెరుగైన ఫలితాల్ని రాబట్టుకోవడానికి ఎటువంటి వ్యూహాల్ని అమలు చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️