నవ భారత నిర్మాతలం

Apr 13,2024 04:06 #jeevana

మేం పిల్లలం
దేశాభ్యుదయ సూర్యులం!
మేం పువ్వులం
దేశ భవితకు పునాదులం!
నెహ్రూ వారసులం
కలాం స్వప్నాలం
వివేకానంద శిష్యులం
మేం పిల్లలం
నవ భారత నిర్మాతలం!

ప్రగతి బాటలో ప్రయాణికులం!
అంబేద్కర్‌ ప్రజాస్వామ్యపు కిరణాలం!
కలలతో జీవిస్తాం
కలహాలను విస్మరిస్తాం
ఊహలలో విహరిస్తాం
ఉజ్వల భవిష్యత్‌ను నిర్మిస్తాం
రాకెట్‌లా అంతరిక్షంలో
దూసుకుపోతాం
మేం పిల్లలం
గాంధీ తాత గమ్యాలం..!

మతాలను మాయం చేస్తాం
మానవత్వం చాటి చెప్తాం
మేధావుల మాటలు వింటాం
మెరిసే తారలను కనుక్కుంటాం
మేం పిల్లలం..
కపటం లేని పసిమొగ్గలం!

– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌,
నాగర్‌ కర్నూలు,
93947 49536.

➡️