జాతీయ సదస్సులో బహుమతులు

Jan 13,2024 01:07

ప్రజాశక్తి – అద్దంకి
సింగరకొండ కెఆర్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష, రసాయన శాస్త్ర విభాగాలు సంయుక్తంగా జాతీయ యువజన దినోత్సవం, వివేకానంద జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కానుకగా విద్యార్థులకు ప్రయోజనకరంగా జాతీయ స్థాయిలో విద్యార్థుల కొరకు రెండు రోజులు ప్రేరణ జాతీయ సదస్సు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 500కుపైగా విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యారు. మొదటి రోజున ముగ్గురు వక్తలు విద్యార్థులకు ఉపయోగపడే మానవ విలువలు, వాచక సామర్థ్యంను పెంపొందించు కొనుటకు, ఉద్యోగ సాధన నైపుణ్యాలపై ఆన్లైన్ వేదికగా ప్రసంగించారని కళాశాల ప్రిన్సిపాల్ బి మోహనరావు తెలిపారు. 2వ రోజు వివేకానంద జీవిత స్ఫూర్తిపై ప్రసంగించారు. 25మంది విద్యార్థులు పరిశోధనా ప్రతులను న్యాయ నిర్నేతలు ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. దానిలో ఉత్తమంగానున్న మొదటి మూడు ప్రసంగాలను నగదు రూపంలో, ధ్రువీకరణ ప్రశంసా పత్రాలను విద్యార్థులకు అందించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ వి మోహనరావు అధ్యక్షత వహించారు. సమన్వయకర్త డాక్టర్ ఈ ప్రభుదాస్ ప్రోత్సాహం అదించారు. కార్యక్రమంలో రాజశేఖర్, పివి హేమలత, డాక్టర్ షేక్ మస్తాన్వలి, విబివి రామకృష్ణ, ఇ షర్మిల పాల్గొన్నారు.

➡️