జగన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Dec 21,2023 11:38 #ap cm jagan, #PM Modi

ప్రజాశక్తి-అమరావతి :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా సీఎం జగన్‌ను విష్‌ చేశారు. సీఎం జగన్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు

గవర్నర్‌ శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు జగన్‌ పుట్టిన రోజును వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. రక్తదాన శిబిరాలను, అన్నదానాలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేస్తున్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టారు.

➡️