కేరళ లోకాయుక్త బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Mar 1,2024 10:30 #kerala, #Lokayukta Bill

ఇది ప్రభుత్వ విజయం : సిపిఐ(ఎం)

తిరువనంతపురం : కేరళ లోకాయుక్త (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంపై కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్‌ హర్షం వ్యక్తం చేసింది. కేరళ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయడానికి ‘మొండిగా నిరాకరిస్తున్న’ గరవ్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వైఖరికి ఇది విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. కేరళ న్యాయశాఖ మంత్రి పి.రాజీవ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం వి గోవిందన్‌ మాట్లాడుతూ ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడాన్ని ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. గవర్నర్‌ ఖాన్‌కు ఇదొక గుణపాఠం అని చెప్పారు.అసెంబ్లీ అమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా గవర్నర్‌ ఖాన్‌ తన వద్దే నిలిపిఉంచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును కేరళ ప్రభుత్వం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం ఖాన్‌ పంపారు. వీటిలో కేరళ లోకాయుక్త (సవరణ)బిల్లు కూడా ఒకటి.

➡️