ఐపిఒకు ప్రీమియర్‌ ఎనర్జీస్‌

Apr 20,2024 21:53 #businses, #Energy
  • రూ.1,500 కోట్ల నిధులపై దృష్టి

ముంబయి : ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ) కోసం ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సెబీకి ప్రతిపాదన పత్రాల (డిఆర్‌హెచ్‌పి)ను అందించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.1,500 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సెల్లింగ్‌ షేర్‌ హోల్డర్లు 2.82 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించనున్నారు. సమీకరించిన నిధుల్లో రూ.1,168 కోట్ల మొత్తాన్ని అనుబంధ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ (పిఇజిఇపిఎల్‌)లో ఇన్వెస్ట్‌ చేయాలని సంస్థ భావిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో 4గిగావాట్‌ సోలార్‌ పివి టాప్‌కాన్‌ సెల్‌, 4 గి.వా. సోలార్‌ మాడ్యూల్‌ తయారీ ప్లాంటుకు పాక్షికంగా నిధులను వెచ్చిచనున్నట్లు పేర్కొంది. మిగతా మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుందని తెలిపింది.

➡️