శీతాకాలంలో పాటించాల్సినవి…

Dec 17,2023 14:41 #Health Awareness, #Sneha
precautions in winter season

సీజన్‌తో సంబంధం లేకుండా, సమ్మర్‌ అయినా వింటర్‌ అయినా బాడీ టెంపరేచర్‌ ని రెగ్యులేట్‌ చేయాలంటే నీరు అవసరం. తగినంత నీరు తాగుతూ ఉండడం వల్ల లోపలి నుండి టెంపరేచర్‌ రెగ్యులేషన్‌ జరుగుతుంది. హైపోథెర్మియా లాంటి కండిషన్స్‌ ని రక్షణ చేయవచ్చును.

చలిగా, పొడిగా ఉండే వాతావరణం ఎనర్జీనంతా పీల్చేస్తుంది. ఫలితంగా బద్ధకంగా అనిపించడంతో పాటు జలుబు, ఫ్లూ వంటి సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. నీరు తాగడం వలన ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది, ఇన్‌ఫెక్షన్స్‌ బారిన పడకుండా ఉంటారు.

హైడ్రేటెడ్‌ గా ఉంటే శరీరానికి ఫ్యాట్స్‌ని బ్రేక్‌ డౌన్‌ చేయడం తేలిక అవుతుంది. ఫలితంగా బరువు తగ్గడం తేలిక అవుతుంది. ొ నీరు సరిపోకపోతే ఆ ఎఫెక్ట్‌ ముందుగా కనిపించేది స్కిన్‌ మీదే. స్కిన్‌ డ్రై గా, డల్‌గా తయారవుతుంది. స్కిన్‌ హెల్త్‌ కి కూడా నీరు అత్యవసరం

శీతాకాలం రాగానే శరీరం పొడిబారినట్లవుతుంది. కొందరిలో చర్మం చిట్లుతుంది. పెదవులు పగిలిపోతుంటాయి. ముఖ్యంగా మహిళలు శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. పొడి చర్మం కలిగిన వారైతే… రెండు టీ స్పూన్లు బాదంనూనె, రెండు టీస్పూన్ల బాదం పొడి, రెండు టీ స్పూన్లు అరటి ముక్కలు, రెండు టీస్పూన్లు గ్లిజరిన్‌ లేదా తేనే, నాలుగు టీ స్పూన్లు పాలు కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్‌ చేసి ముఖానికి, మెడకు మదువుగా మసాజ్‌ చేస్తూ పట్టించి కొద్దిసేపు వుంచి కడిగేయాలి. చర్మం మదువుగా మారుతుంది. శీతాకాలంలో అద్భుతంగా పనిచేస్తుంది. చేతులు, పాదాలకు కూడా అప్లరు చేయవచ్చు.

జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్‌మీల్‌ పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధం పొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది.

ఇక శిరోజాల సంరక్షణకు.. కప్పు బొప్పాయి గుజ్జు, అరకప్పు కొబ్బరి క్రీమ్‌ లేదా పాలు, పావు కప్పు కొబ్బరినూనె, పావు కప్పు బీట్‌ రూట్‌ జ్యూస్‌ కలిపి పేస్టు తయారు చేసుకుని జుట్టుకు, పట్టించాలి. పదినిమిషాలాగి హెర్బల్‌ షాంపూతో వాష్‌ చేసుకోవాలి. శీతాకాలంలో ఈ ప్యాక్‌ జుట్టును పరిరక్షిస్తుంది. జుట్టురాలడాన్ని, చుండ్రును తగ్గిస్తుంది.

➡️