వచ్చేనెలలో ‘ప్రసన్న వదనం’

Apr 25,2024 19:05 #movie, #suhas

సుహాస్‌ నటించిన ‘ప్రసన్న వదనం’ చిత్రం మే నెలలో విడుదల కానుంది. తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పి రిలీజ్‌ చేస్తుండగా, కన్నడ రీమేక్‌ని కర్ణాటకలో హోంబళే ఫిల్మ్స్‌ విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణన్‌, రాశి సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. విజరు బుల్గానిన్‌ సంగీతం అందించారు. జెఎస్‌ మణికంఠ, టిఆర్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్మాణం వహించారు.

➡️