వృద్ధులు, వికలాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

85 ఏళ్లు పైబడిన వృద్ధులు

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌

  • ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌

ప్రజాశక్తి- పలాస

85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40 శాతం పైబడి అంగవైకల్యం కలిగిన వికలాంగులు, దీర్ఘకాలిక రోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని ఆర్‌డిఒ, రిటర్నింగ్‌ అధికారి భరత్‌ నాయక్‌ తెలిపారు. స్థానిక కళ్యాణ మండపంలో ఎన్నికల అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈనెల 15, 16, 17 తేదీల్లో ఎన్నికల అధికారులు గ్రామాల్లో పర్యటించి 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక రోగులను గుర్తించి వాళ్ల నుంచి 12-డి ఫారం తీసుకోవాలన్నారు. 85 ఏళ్లు నిండినట్లు, 40 శాతం అంగవైకల్యం కలిగిననట్లు వారి నుంచి ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచే యాలని ఆదే శించారు. ఎటువంటి నిర్లక్ష్యం వహించి నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో తహశీల్దార్‌ ఎస్‌.వి.వి.ఎస్‌ నాయుడు పాల్గొన్నారు.

➡️