హాకీ జాతీయస్థాయి పోటీలకు ఫోర్టసిటీ పాఠశాల విద్యార్థి

Nov 22,2023 17:22 #Vizianagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ అనకాపల్లి దగ్గరలో వున్న నక్కపల్లెలో నాలుగు రోజుల పాటు నిర్వహించే హాకీ స్టేట్ మీట్ ఫోర్ట్ సిటీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పి.రిషి, 17సం||ల వయస్సు విభాగంలో మధ్యప్రదేశ్ లో జరగబోయే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తమ పాఠశాల విద్యార్థి హాకీలో జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్పడం చాలా గర్వించదగిన విషయమని ఫోర్బ్స్ సిటీ పాఠశాల చైర్మన్ కె.ఎ.పి. రాజు (శివ) అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపించి వివిధ రకములైన ఆటల పోటీల్లో పాల్గొనాలని తెలిపారు. విద్యార్దిని అభినందించిన వారిలో పాఠశాల వైస్ చైర్మన్ చంటి, ప్రిన్సిపాల్ రోయినాఖాన్, డైరెక్టర్లు మధు, అశోక్, నీలిమా అభినందించారు.

➡️