సారవ గ్రామంలో పోలీసులు ,సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరిచాలని నరసాపురం రూరల్ సీఐ కె.గోవింద్ రాజు ,రూరల్ ఎస్సై కె.గుర్రయ్య అన్నారు. ఆదివారం మండలంలోని సారవ గ్రామంలో రూరల్ పోలీసులు ,సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో గ్రామంలో కవాతు నిర్వహించారు.సారవ సెంటర్ నుండి చిన్న సారవ సెంటర్ వరకూ వీధులు గుండా కవాతు నిర్వహించారు.ఈ సంధర్భంగా సీఐ గోవింద్ రాజు,గుర్రయ్య మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఎన్నికలు సమయంలో అల్లర్లు,కవ్వింపు చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ప్రశాంత వాతావరణం కలిగిస్తున్నామన్నారు.

➡️