పాఠశాల విద్యాశాఖలో చిత్రవిచిత్రాలు

Apr 4,2024 12:31 #AP Education, #TDP

నీలాయపాలెం విజయ్ కుమార్

విద్యార్ధుల సంఖ్య తగ్గే కొద్ది ఖర్చు తగ్గాల్సిన విద్యా కానుక ఎందుకు పెరిగింది?
గత 5 ఏళ్లల్లో 5.70 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తరలిపోలేదా?
ప్రవీణ్ ప్రకాష్ విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీనా..? వైసీపీ కార్యకర్త…?

ప్రజాశక్తి-మంగళగిరి : గత 5 ఏళ్ల నుంచి పాఠశాల విద్యా శాఖలో జరిగిన చిత్రవిచిత్రాలు ఏ శాఖలోను జరగలేదని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అవినీతి, అస్థవ్యస్థంతో చిన్నపిల్లలపై పరిశోధనలు చేశారని తెలిపారు. విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి హోం వర్కులు రాశారా లేదా అని పరిశీలించమని చెప్పే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ శాఖలో జరుగుతున్న అవినీతిని పట్టించుకోరా? అని ప్రశ్నించారు.
”ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో విద్యార్ధులు తక్కువయ్యే కొద్ది విద్యా కానుక ఖర్చు పెరిగిపోతుంది. ఢిల్లీలో 30 మంది కూడా లేని ఇంగ్లీష్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చేశారు. విద్యా శాఖకు ప్రవీణ్ ప్రకాషీ పీఆర్ ఎజెన్సీని పెట్టుకున్నారు. తమిళనాడు న్యూస్ ప్రింట్ లిమిటెడ్ అనేది తమిళనాడు సంస్థకు రూ.200 కోట్లు బాకీ పడ్డారు. తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇస్తున్నారు కాబట్టి ఆ బాకీ ఈ డబ్బులు చెల్లేసుకోమంటున్నారు. రూ.1,000 కోట్ల టెండర్లు విద్యాకానుకలో పాత కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు. టెండర్ లేకుండా పాత కాంట్రాక్టర్ లకు ఇచ్చిన 19 మందికే మళ్లీ కాంట్రాక్టర్ ఇచ్చేశారు. రూ.1,000 కోట్ల టెండర్ వేసినప్పుడు న్యాయ పరీక్షకు ఎందుకు పోలేదని ప్రశ్నిస్తే 19 మంది కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లకు దాటకుండా రూ.1000 కోట్లు టెండర్ ఇచ్చారు.” అని తెలిపారు.
”విద్యార్ధుల నమోదులో నూరు శాతం గ్రాస్ రేషియో నిష్పత్తి తగ్గకుండా చూస్తానని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ రాజకీయ నాయకుడి మాదిరి శపధాలు చేశారు. గత 5 ఏళ్లల్లో 5.70 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు తరలిపోవడం ఆయనకు కనపడలేదు. స్కూళ్లకు రంగులు కొట్టి రూ.1,800 కోట్లు కొట్టేశారు. సీబీఎస్ఈ, వరల్డ్ బ్యాంక్ సాల్డ్ ఒప్పందం, 4,700 పాఠశాలల మూసివేశారు, బైజూస్ పేరుతో ట్యాబ్ల కుంభకోణం, మళ్లీ ఐబీ అంటున్నారు.” అని అన్నారు.
”విద్యా కానుకకు 2021-22లో 45 లక్షల మంది విద్యార్ధులకు రూ.789 కోట్లు ఖర్చు చూపించిన ప్రభుత్వం 2023-24లో 39 లక్షల మంది విద్యార్ధులకు రూ.1,042 కోట్లు ఖర్చు అవుతుందని అంటున్నారు. విద్యార్ధుల సంఖ్య తగ్గినప్పుడు ఖర్చు తగ్గాల్సింది పోయి ఎందుకు పెరిగింది? అంటే రూ.270 కోట్లు అడ్డంగా దోచేశారు. ఏప్రిల్ 1 నాటికి 39 లక్షల 30వేల విద్యార్ధులు ఉన్నారు. మళ్లీ 2024-25లో మరో రూ.1,000 కోట్లకు మళ్లీ పిలుస్తున్నారు. ఇటవుంటి అవినీతి ప్రవీణ్ ప్రకాష్ కి కనిపించడం లేదా? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా ఇంత పెద్ద కాంట్రక్ట్ అప్పగిస్తారా? విద్యాశాఖలో నలుగురు ఐఏఎస్ లు మెయింటెన్స్ చేస్తున్నారు.” అని పేర్కొన్నారు.
”టోఫెల్ కి అందరిని సన్నద్ధం చేస్తున్నామని సీఎం జగన్ అనేక సార్లు చెప్పారు. లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీలో ఉంది, ఈ సంస్థకు 34 మంది ఉద్యోగులే ఉన్నారు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఎస్ఈఆర్టీ బాగుందని అన్నారంటా? ఎంపిక చేసిన టీచర్లకు ఇప్పటికే టోఫెల్ ట్రైనింగ్ ఇచ్చేశారని, విద్యార్ధులందరూ టోఫెల్ కి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. లిక్విడ్ ఇంగ్లీష్ ఎడ్జ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వెబ్ సైట్ ని చూస్తే బండారం భయటపడుతుంది. నలుగురికి శిక్షణ ఇచ్చేసి అందరికి ఇచ్చేశామంటూ అమ్మా, నాన్నలను మోసం చేస్తున్నారు.” అని ఆయన తెలిపారు.

➡️