డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ని మానసికంగా పరీక్షించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు

చెన్నై : ప్రముఖ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ని మానసికంగా పరీక్షించాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలైంది. మధురైకి చెందిన రాజు మురగన్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ చిత్రాన్ని నిషేధించాలని, ఈ చిత్రంలో హింసాత్మక సంఘటనలు కోకొల్లలు ఉన్నందున ఆ సన్నివేశాలను చిత్రీకరించిన డైరెక్టర్‌ కనగరాజ్‌ని మానసికంగా పరీక్షించమని మురగరాజ్‌ పిటిషన్‌లో కోరడమైంది. కోలీవుడ్‌ హీరో విజరు నటించిన లియో చిత్రంలో హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఉన్నాయి. మత చిహ్నాలు, డ్రగ్స్‌, మహిళలు.. చిన్నారులపై హింసను ప్రేరేపించేవిధంగా ఉంది. ఇలాంటి చిత్రాలను సెన్సార్‌బోర్డు క్షుణ్ణంగా పరిశీలించాలని, డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ మానసిక పరీక్షలు చేయించుకోవాలని పిటిషనర్‌ వాదించారు. భారతీయ క్రిమినల్‌ చట్టం ప్రకారం లియో చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై కనగరాజ్‌ తరపు న్యావాదులు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తులు కృష్ణకుమార్‌, విజయకుమార్‌లు ఈ కేసును వాయిదావేశారు.

➡️