పరిమళించిన మానవత్వం

Apr 23,2024 21:06

ప్రజాశక్తి-బొబ్బిలి : ఎవరైనా బాధల్లో ఉన్నారంటే చాలు ఆయన వెంటనే పెద్దమనసు చేసుకొని స్పందిస్తారు. బాధితులు, అన్నార్తుల బాధలు, వారి కష్టాలు ఏమిటో తెలుసుకుంటారు. అందులో కులం, మతం, ప్రాంతం వంటివేమీ చూడకు ండా వారిని మానవతతో సాకి ఆపన్న హస్తం అందిస్తారు. నేనున్నానంటూ కొండంత భరోసాను, ధైర్యాన్ని ఇస్తారు. ఆయనే కారుణ్య ఫౌండేషన్‌ చైర్మన్‌, రోటరీ క్లబ్‌ బొబ్బిలి అధ్యక్షులు జెసి రాజు. సామాజిక సేవా రంగంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ విషయం మరోమారు నిరూపితమైంది.బొబ్బిలి పట్టణంలోని తారక రామా కాలనీకి పిరిడి రాంబాబు గతంలో జ్యూట్‌ పరిశ్రమలో పనిచేసి, ఉపాధి కోల్పోయాడు. పక్షవాతం బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నాడు. సంపా దన లేదు. వైద్యం అందక, మందులు కొనే స్థోమత లేక, సరైన పోషణ లభించక.. అద్దె ఇంట్లో ఉంటూ సాయా న్ని అందించే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. రాంబాబుకు మంచి వైద్యం అందితే ఆయన మామూలు మనిషి కాగలరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాంబాబు గురించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర రావు ద్వారా జెసి రాజు తెలుసుకున్నారు. తక్షణమే స్పందించిన ఆయన మందుల కోసం రూ.5 వేలు నగదు, మరో రూ.5 వేల నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు బాధితునికి చికిత్స నిమిత్తం వైద్యులను సంప్రదిస్తు న్నామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. జెసి రాజుకు ఆ కుటుంబ సభ్యులతోపాటు శంకరరావు కృతజ్ఞతలు తెలిపారు.

➡️