ఎన్నికల్లో భాగస్వాములు కండి : కలెక్టర్‌

కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌

    అనంతపురం కలెక్టరేట్‌ : త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను చైతన్యం చేసేలా విద్యార్థులు, కార్జునిస్టులందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ డా||వి.వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలు డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ టీచర్లు, ఉన్నత, కెజిబివి పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కళాశాలలు, జెఎన్‌టియు, ఎస్‌కెయు, సెంట్రల్‌ యూనివర్సిటీల విద్యార్థులు, కార్టూనిస్టులు, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ సంస్థలు ఎన్నికల మస్కెట్‌ రూపకల్పనలో పాలుపంచుకోవాలన్నారు. సాధారణ ఎన్నికలు – 2024 నేపథ్యంలో స్వీప్‌ యాక్టివిటీల్లో భాగంగా ఎన్నికల మస్కెట్‌ రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు ఈనెల 13వ తేదీ చివరి తేదీ అన్నారు. టాప్‌ 3 ఎంట్రీలను జిల్లా ఎన్నికల అధికారి వెబ్‌ సైట్‌లో ప్రదర్శించనున్నట్లు తెలియజేశారు. ఎంట్రీలను a్‌జూవశ్రీవష్‌ఱశీఅఎaరషశ్‌ీఏస్త్రఎaఱశ్రీ.షశీఎ అనే ఈమెయిల్‌ ఐడికి పేరు, మొబైల్‌ నెంబర్‌, చిరునామాతో కూడిన వివరాలను నమోదు చేసి పంపాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు క్యాంపెయిన్‌- 2024 లో భాగంగా జిల్లా స్థాయి మూల్యాంకన కమిటీ ద్వారా ఎంపిక చేయబడిన ఎన్నికల మస్కెట్‌ రూపకర్తకు రూ.5 వేల నగదు బహుమతి ఇస్తామన్నారు. ఏదైనా సందేహం కోసం జిలాన్‌ మొబైల్‌ నంబర్‌ 9177101476 ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నికల మస్కెట్‌ రూపకల్పనలో జిల్లా ప్రజలు, డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ టీచర్లు, విద్యార్థులు పాలుపంచుకోవాలని సూచించారు.

➡️