మాల్దీవుల్లో ముగిసిన పార్లమెంటు ఎన్నికలు – నేడు ఫలితాలు

Apr 22,2024 08:04 #2024 election, #Maldives
  • ముయిజ్ఞుకే విజయావకాశాలు

మాలె : ద్వీప దేశం మాల్దీవులులో పార్లమెంటు ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మాల్దీవుల పార్లమెంట్‌ (పీపుల్స్‌ మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 2.84 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. దేశాధ్యక్షులు మహ్మద్‌ ముయిజ్ఞు ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పిఎన్‌సి) ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించే వీలుందని స్థానిక మీడియా పేర్కొంది. పూర్తి స్థాయి ఎఇన్నకల ఫలితాలను ఈ నెల 22న ప్రకటించనున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం..పిఎన్‌సి 93 స్థానాలకు గాను 50 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. సాధారణ మెజారిటీకి 47 స్థానాలు వస్తే సరిపోతుంది. గతేడాది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహ్మద్‌ మొయిజ్జు.. తన విధానాలను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్లమెంట్‌ మద్దతు లభిస్తుందా లేదా అనేది ఈ నెల 22న తేలనుంది. ముయిజ్ఞు భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారంటూ ప్రతిపక్షం ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం.

➡️