పంత్‌… ఫటా ఫట్‌… అక్షర్‌ పటేల్‌ అర్ధసెంచరీ

Apr 24,2024 22:36 #Sports

ఢిల్లీ క్యాపిటల్స్‌ 224/4
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో తొలిసారి ఢిల్లీ బ్యాటర్లు కదం తొక్కారు. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో బుధవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ ఢిల్లీ బౌలర్లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా రిషబ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ చెరో అర్ధ సెంచరీతో చెలరేగారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జేక్‌ ఫ్రేజర్‌, పృథ్వీ షా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కానీ నాలుగో ఓవర్‌కే ఇద్దరూ ఔటయ్యారు. పవర్‌ ప్లే ముగిసేలోపు షై హోప్‌ (5) రూపంలో మూడో వికెట్‌ను కోల్పోయింది. వరుసగా వికెట్లను కోల్పోవడంతో ఢిల్లీ బ్యాటర్లు ఆచి తూచి ఆడటం మొదలుపెట్టారు. 15ఓవర్ల తర్వాత రిషబ్‌ పంత్‌ (88), అక్షర్‌ పటేల్‌ (66) జోరుగా ఆడారు. ఇద్దరూ చెరో అర్ధ సెంచరీతో చెలరేగారు. అయితే 17వ ఓవర్‌లో సాయికిశోర్‌కు క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పటేల్‌ ఔటయ్యాడు.
తర్వాత వచ్చిన స్ట్రబ్స్‌(26నాటౌట్‌) కూడా రాణించాడు. గుజరాత్‌ బౌలర్లు వారియర్‌కు మూడు, నూర్‌ అహ్మద్‌కు ఒక వికెట్‌ దక్కాయి.
పంత్‌ విధ్వంసం..
క్రీజులోకి వచ్చీ రావడంతోనే కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ధాటిగా ఆడాడు. వరుస బౌండరీలతో స్కోర్‌ బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు స్టబ్స్‌కు ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్‌ బౌలర్లకు చెమటలు పట్టించారు. సాయి కిషోర్‌ వేసిన 19వ ఓవర్‌లో స్టబ్స్‌ వరుసగా 4, 6, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. మోహిత్‌ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో రిషభ్‌ పంత్‌ వరుసగా 2, 6, 4, 6, 6, 6 బాది 31 పరుగులు పిండుకున్నాడు. ఢిల్లీ జట్టు చివరి 30 బంతుల్లో 97పరుగులు చేసిం దంటే వారిద్దరూ ఏ స్థాయిలో బ్యాట్‌ ఝుళిపించారో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20ఓవర్లు ముగిసరికి నాలుగు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి)నూర్‌ అహ్మద్‌ (బి)వారియర్‌ 11, ఫ్రేసర్‌ (సి)నూర్‌ అహ్మద్‌ (బి)వారియర్‌ 23, అక్షర్‌ పటేల్‌ (సి)సాయి కిషోర్‌ (బి)నూర్‌ అహ్మద్‌ 66, హోప్‌ (సి)రషీద్‌ ఖాన్‌ (బి)వారియర్‌ 5, రిషబ్‌ పంత్‌ (నాటౌట్‌) 88, స్టబ్స్‌ (నాటౌట్‌) 26, అదనం 6. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 224పరుగులు.
వికెట్ల పతనం: 1/35, 2/36, 3/44, 4/157
బౌలింగ్‌: అజ్మతుల్లా 4-0-33-0, వారియర్‌ 3-0-15-3, రషీద్‌ ఖాన్‌ 4-0-35-0, నూర్‌ అహ్మద్‌ 3-0-36-1, మోహిత్‌ శర్మ 4-0-73-0, షారుక్‌ ఖాన్‌ 1-0-8-0, సాయి కిషోర్‌ 1-0-22-0.

➡️