హామీలు అమలు చేయాలి

Feb 14,2024 11:43 #Manyam District
panchayati workers protest

పంచాయితీ వర్కర్ల డిమాండ్ 
ప్రజాశక్తి-పార్వతీపురం మన్యం :  జిల్లా వీరఘట్టం పంచాయతీలో కార్మికులందరికీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 57, 132 ప్రకారం పంచాయతీకి వచ్చిన ఆదాయంలో 60శాతం నిధులు జీతాలకు వెచ్చించి, ఇస్తున్న జీతాలను పెంచి ఇవ్వాలని ఏపీ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. వీరఘట్టంలో జరిగిన కార్మికుల సమావేశంలో ఏపీ పంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకులు ఎన్ .వై .నాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల చిన్నచూపు మానుకోవాలని, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కార్మికులకు ఇస్తున్న హక్కులను పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని ,పని భారం పెరుగుతున్నందున కార్మికులను పెంచాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సబ్బులు, నూనెలో, చెప్పులు, బట్టలు ఇవ్వాలని, చనిపోతున్న వారికి నష్టం నష్టపరిహారం ఇవ్వాలని, దహన సంస్కార్ ఖర్చులు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సెలవులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీలను ఉత్సవ విగ్రహాలగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చేస్తున్నాయని, ఈనెల 16న జరుగుతున్న గ్రామీణ బంధుకు ఏపీ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి రావాల్సిన నిధులు విడుదల చేసి, ప్రజలకు సౌకర్యాలు పెంచుతూనే కార్మికులకు మెరుగైన వేతనాలు సౌకర్యాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పడాల ప్రసాదు, వి కాంచనమ్మ నాగవంశం వెంకటేష్, పడాల శ్రీను, జయమ్మ, కళ్యాణి సుశీల, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

➡️