ఇమ్రాన్‌ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష

ఇస్లామాబాద్‌ : ప్రభుత్వ రహస్యాలను వెల్లడించారని ఆరోపిస్తూ నమోదైన కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు, ఆయన పార్టీ డిప్యూటీల్లో ఒకరికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పాకిస్తానీ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఇప్పటికే అవినీతి కేసులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్న ఖాన్‌కు ఇది మరో ఎదురుదెబ్బ. ఈ తీర్పును అప్పీల్‌ చేసే హక్కు పార్టీకి వుందని పార్టీ ప్రతినిధి జుల్ఫికర్‌ బుఖారి తెలిపారు. ఫిబ్రవరి 8న పాక్‌లో పార్లమెంటరీ ఎన్నికలు జరగనుండగా ఈ రూలింగ్‌ వెలువడింది. ఈ ఎన్నికల్లో ఖాన్‌ పోటీ చేయడానికి వీల్లేకపోయినా ప్రజలను ప్రభావితం చేయగలిగే రాజకీయ శక్తిగా వున్నారు. ఈ పరిస్థితుల్లో తనపై పెట్టిన కేసులు, వాటిల్లో తీర్పులు చూస్తుంటే ఓటింగ్‌కు ముందు తనను పక్కకు నెట్టే కుట్రే ఇదని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపిస్తున్నారు. ఖాన్‌పై పెండింగ్‌లో వున్న 150కి పైగా కేసుల్లో సిఫర్‌ కేసు ఒకటి. అవిశ్వాస తీర్మానం ద్వారా తనను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత ఒక ర్యాలీలో ప్రభుత్వ రహస్య పత్రాన్ని బహిరంగంగా ప్రదర్శించారని ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి.

➡️