ఉపాధి హామీ రోజుకు రూ.300 ఇస్తాం పీడీ సివి శ్రీనివాస ప్రసాద్‌

ఉపాధి హామీ రోజుకు రూ.300 ఇస్తాం పీడీ సివి శ్రీనివాస ప్రసాద్‌

ఉపాధి హామీ రోజుకు రూ.300 ఇస్తాం పీడీ సివి శ్రీనివాస ప్రసాద్‌ప్రజాశక్తి – ఏర్పేడు ఉపాధి హామీ రోజు వేతనం రూ.300 పెరిగిందని, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ద్వామా పీడీ సివి శ్రీనివాస ప్రసాద్‌ చెప్పారు. ఏర్పేడు మండలంలోని కందాడు పంచాయతీలో జరుగుతున్న ఇంకుడుగుంతల పూడిక తీత పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఆయన పరిశీలించిన చోటే కూలీలకు ఎటువంటి నీడా లేకపోవడం గమనార్హం. అనంతరం కూలీలతో మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందు వల్ల ఉదయం 5.30 గంటలకే పని మొదలు పెట్టి కొలతల ప్రకారం పనిచేసి 10 గంటలకల్లా ఇళ్లకు వెళ్లవచ్చని, పని వద్ద తాగునీరు, నీడ, గ్రామంలోని ఎఎన్‌ఎం సహకారంతో ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రథమ చిక్సి పెట్టి ఏర్పాటు చేయాలని సూచించారు. పొలాల్లో ఇంకుడుగుంతలు తవ్వి వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలను పెంపొందించు కోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా సాగు చేస్తున్న పండ్ల తోటలను తనిఖీ చేసి రైతులతో మాట్లాడుతూ వేసవిలో నీటి తడులు క్రమం తప్పకుండా అందివ్వాలని సూచించారు. నిమ్మ చెట్లు, జీడి మామిడి, మామిడి, బత్తాయి,, నాటు జామ తైవాన్‌ జామ,సపోటా, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ జామున్‌ నేరేడు, చింత, ఆపిల్‌ బేర్‌, డ్రాగన్‌ ఫ్రూట్‌, గులాబీ రోజా పూల చెట్లు, మల్లెలు మునగ తోట వంటి పండ్ల, పూల తోటలను ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు పెంపకం చేపడితే సస్య రక్షణ కు, అంతర పంటల పెంపకానికి ఎరువులు ఖర్చు, సాగు ఖర్చు, వాచ్‌ అండ్‌ వార్డ్‌, మెటీరియల్‌ బిల్లులు కింద మూడు సంవత్సరాల పాటు ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు పెంపకం చేపట్టినందుకు ఆర్ధిక ప్రయోజనం కల్పిస్తామన్నారు. రైతులు ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో అధనపు కార్యాక్రమాధికారి అవిలాల దేవరి, సీడీసిఎల్‌ ఆర్సి చంద్రశేఖర్‌ రాజు, జూనియర్‌ ఇంజనీర్‌ పాంజాడ బాలాజి రావ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పట్టాభి రెడ్డి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మునేయ్య పాల్గొన్నారు.

➡️