పి.గన్నవరం నియోజక వర్గ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను మార్చాలి

Apr 20,2024 17:30

విలేకరుల సమావేశం లో మాట్లాడుతున్యనఉమ్మడి అభ్యర్థి గిడ్డి

ప్రజాశక్తి -మామిడికుదురు

ప్రస్తుతం పి.గన్నవరం నియోజకవర్గం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ గా ఉన్న శ్రీ రామ చంద్ర మూర్తి స్థానం లో వేరే వారిని నియమించాలని టిడిపి, బిజెపి, జనసేన అభ్యర్థి గిడ్డి సత్య నారాయణరావు అన్నారు. జిల్లా పరిషత్‌ డిపార్ట్మెంట్‌లో సిఇఒగా ఉండి ప్రస్తుత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్‌పి ఛైర్మన్‌, పి.గన్నవరం నియోజకవర్గం వైసిపి అభ్యర్థి విప్పర్తి వేణు గోపాల రావు తో కలిసి పని చేసిన ఆయనను ఇక్కడ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ గా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు. ఇదే విషయమై ఏప్రిల్‌ 8 వ తేదీన ఎలక్షన్‌ కమిషన్‌ కు, కలెక్టర్‌ కు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఈ విషయాన్ని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ నామన రాంబాబు, మామిడికుదురు మండల టిడిపి అధ్యక్షులు మొల్లేటి శ్రీనివాస్‌, జనసేన మండల అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా, పెదపట్నం లంక సర్పంచ్‌ సుందరనీడి రాజేష్‌ కుమార్‌ (చిన్ని), పి. గన్నవరం నియోజకవర్గం సర్పంచ్‌ ల సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాతకాపు తదితరులు పాల్గొన్నారు.

లంక గ్రామాల్లో ఉమ్మడి అభ్యర్థి ‘గిడ్డి’ ప్రచారం

లంక గ్రామాలెన బి.దొడ్డవరం, పెదపట్నంలంక లో శనివారం పి.గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు తో కలిచి ప్రచారం నిర్వహించారు. సర్పెంచ్‌ సుందరనీడి రాజేస్‌ కుమార్‌ ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరిగేషన్‌ కాలువ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. డ్రయినేజీ సదుపాయం, తాగు నీరు, నదీ కోత నివారణకు గ్రోయిన్లు ఏర్పాటుకు ప్రాధాన్యత కలిపిస్తామన్నారు. తనతో పాటు ఎంపి అభ్యర్థి హరీష్‌ మాథూర్‌లను గెలిపించాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.

➡️