అసైన్డ్‌ భూములున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తాం: కేటీఆర్‌

Nov 22,2023 16:08 #minister ktr, #speech

చౌటుప్పల్‌: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 60 ఏళ్ల పాటు మునుగోడు ప్రజలను ఇబ్బందికి గురి చేసింది ఎవరని ప్రశ్నించారు. గతంలో 11 ఛాన్స్‌లు ఇచ్చినప్పుడు కాంగ్రెస్‌ నేతలు ఏం చేశారు?అని కేటీఆర్‌ నిలదీశారు. 3 గంటల కరెంట్‌ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ చెబుతున్నారని.. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందో? లేదో?ప్రజలే చెప్పాలన్నారు. కరెంట్‌ కావాలో? కాంగ్రెస్‌ కావాలో? తేల్చుకోవాలన్నారు. మరోసారి బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అసైన్డ్‌ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు.ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్‌ క్యాలెండర్‌పై దఅష్టి సారిస్తామన్నారు. అలాగే రైతు బంధు చెల్లింపులకు అనుమతివ్వాలని ఈసీని 2 సార్లు కోరామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పీఎం కిసాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు?అని ప్రశ్నించారు.

➡️