బ్రిస్బెన్‌ టోర్నీ తొలిరౌండ్‌లో ఒసాకా విజయం

Jan 1,2024 21:25 #Sports, #Tennis

బ్రిస్బెన్‌: బ్రిస్బెన్‌ టెన్నిస్‌ టోర్నీలో జపాన్‌ టెన్నిస్‌ సంచలనం నవోమి ఒసాకా గెలుపుతో పునరాగమనం చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత రాకెట్‌ పట్టిన ఒసాకా.. సోమవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో 6-3, 7-6(9-7)తో టమారా కోర్పాచ్‌(జర్మనీ)ను చిత్తుచేసింది. తొలిసెట్‌ను సునాయాసంగా నెగ్గిన ఒసాకాకు రెండోసెట్‌లో అనూహ్యంగా ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌లో ఓ దశలో 5-3తో ఉన్న ఒసాకా చివర్లో వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. అనంతరం 28ఏళ్ల ఒసాకా మాట్లాడుతూ.. భయపడుతూనే కోర్టులోకి దిగానని, తొలిరౌండ్‌లో గెలుపు సంతృప్తినిచ్చిందని వెల్లడించింది. రెండుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఒకసారి యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను నెగ్గిన ఒసాకా.. 2023 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మధ్యలోనే అర్ధాంతరంగా వైదొలిగింది. అనంతరం జపాన్‌ ఆటగాడు రాఫర్‌ కోర్టేను వివాహం చేసుకొని లాస్‌ ఏంజిల్స్‌లో ఓ కుమార్తెకు జన్మనిచ్చింది.

➡️