వృద్ధాప్య పెన్షన్ దేశంలోనే అత్యధికం : ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

Jan 7,2024 00:09

ప్రజాశక్తి – వేటపాలెం
వృద్ధాప్య పెన్షన్ దేశంలోనే అత్యధికంగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన వైఎస్సార్ పింఛన్ పంపిణీ నిర్వహించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ వృద్ధాప్య పెన్షన్‌ను దేశంలోనే అత్యధికంగా రూ.3వేలకు పెంచి ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. వాలంటీర్ల ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంటివద్దకే పెన్షన్‌ తెచ్చి ఇస్తున్నారని అన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం పెన్షన్ రూ.3వేలకు పెంచారని అన్నారు. నూతన సంవత్సరం అంటే తేదీ మారడం కాదని, పేదలు, వృద్దుల జీవితాలు మారాలని అన్నారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని అన్నారు. నూతనంగా మంజూరైన పెన్షన్ లతో మండలంలో 11,014మంది లబ్ధిదారులకు రూ.3కోట్ల 5లక్షల 70వేల 500లు నేరుగా లబ్ధిదారుని ఇంటి వద్ద అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఒ నేతాజీ, వైసిపి మండల అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, రామన్నపేట సర్పంచ్ కందేటీ రమణ, ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు, జెసిఎస్ మండల ఇంచార్జీ లేళ్ల శ్రీధర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, వైసిపి మండల ఉపాధ్యక్షులు జంగిలి రామారావు, అందే కృష్ణ, యువత అధ్యక్షులు ఆవుల అశోక్, జనరల్ సెక్రటరీ పులి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ కట్టా గంగయ్య, మహిళా అధ్యక్షురాలు సీతమహాలక్ష్మి, ఫ్రుద్వి చంద్రమోహన్, పులి హరికృష్ణ, షేక్ ఖాదర్, కర్ణ లక్షరావు, వేటగిరి సంజీవరావు, సాధు రాఘవ, జిడుగు మస్తాన్, జమ్మి ప్రసాదరెడ్డి, మారుబోయిన పాపారావు, పులి సోమయ్య, ఆవుల కొండలు, షేక్ హౌలీ, గవిని వెంకట్రావు, చింతలపూడి తులసిరామ్, భాష పాల్గొన్నారు.


నిజాంపట్నం : సీఎం వైఎస్ జగన్ తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, వైసీపీ ఇంచార్జీ డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్ పెన్షన్లు పంపిణీ చేవారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మోపిదేవి హరనాథ్ బాబు, మదన్, వాసు దేవా, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
నగరం : పెన్షన్‌ రూ.3వేలకు పెంచి సిఎం ఇచ్చిన హామీని అమలు చేశారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు. నూతన పెన్షన్లను మండల పరిషత్‌ కార్యాలయం వద్ద శనివారం పంపిణీ చేశారు. ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య అధ్యక్షత వహించారు. సభలో వైసిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఈపూరు గణేష్‌, జడ్పిటిసి మాన్యం నాగమణి, ఎంపీడీఒ చక్రపాణి ప్రసాద్, తహశీల్దారు ప్రమీల, పిఎసిఎస్ చైర్మన్ బెల్లంకొండ పొలేరు, వెంకటరామయ్య, పధ్యాల బుల్లియ్య, రావి కాంతారావు, సర్పంచ్లు చందోలు దేవదాసు, పాగోలు వెంకటేశ్వరరావు, జాఫర్రు పాల్గొన్నారు.

➡️