ఆసీస్‌తో వన్డే, టి20లకు మహిళాజట్లను ప్రకటించిన బిసిసిఐ

Dec 25,2023 16:07 #Cricket, #Sports

ముంబయి: ఏకైక టెస్ట్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా మహిళల జట్టు ఇక ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఆసీస్‌తో తలపడే భారత మహిళల జట్లను భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) సోమవారం ప్రకటించింది. 15మంది ఆటగాళ్ల జట్టుకు రెండు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికయ్యారు. ముంబయిలోని వాంఖడే వేదికగా వన్డే సిరీస్‌, నయా ముంబయిలోని డివైపాటిల్‌ వేదికగా టి20 సిరీస్‌ జరగనున్నాయి. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల, మరో మూడు వన్డేల టి20 సిరీస్‌ జరగనున్నాయి. తొలి వన్డే ఈనెల 28న జరగనుండగా.. ఏకైక టెస్ట్‌లో ఆసీస్‌ను 8వికెట్ల తేడా చిత్తుచేసిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది.

భారత మహిళల వన్డే జట్టు : హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), అమంజోత్‌ కౌర్‌, శ్రేయాంక పాటిల్‌, మన్నత్‌ కశ్యప్‌, సైకా ఇషాక్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సాధు, పూజా వస్త్రాకర్‌, స్నేహ రాణా, హర్లీన్‌ డియోల్‌

భారత మహిళల టీ20 జట్టు : హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), అమంజోత్‌ కౌర్‌, శ్రేయాంక పాటిల్‌, మన్నత్‌ కశ్యప్‌, సైకా ఇషాక్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సాధు, పూజా వస్త్రాకర్‌, కనికా అహుజా, మిన్ను మణి

వన్డే సిరీస్‌..

  1. డిసెంబర్‌ 28 : తొలి వన్డే
  2. డిసెంబర్‌ 30 : రెండో వన్డే
  3. జనవరి 2 : మూడో వన్డే

టి20 సిరీస్‌..

  1. జనవరి 5 : తొలి టి20
  2. జనవరి 7 : రెండో టి20
  3. జనవరి 9 : మూడో టి20
➡️