కలబందలో పోషకాలు

Jan 9,2024 11:06 #feature

              ఔషధ మొక్కగా ఉన్న కలబంద (అలోవెరా)లో అనేక పోషకాలు ఉన్నాయి. అందులో ఉండే గుజ్జు 96 శాతం నీటితోనే తయారవుతుంది. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. కాస్మొటిక్‌, ఫుడ్‌, స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.వీటిలో ఉండే గుజ్జు, కొబ్బరి నూనె కలిపి తలకు పట్టిస్తే చుండ్రు వదిలిపోతుంది. మృత కణాలు తొలగిపోతాయి. జుట్టు మెరుస్తూ, మృదువుగా మారిపోతుంది. జుట్టు రాలిపోయేవారు ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. బిపి, షుగర్‌ వంటివి తగ్గేందుకు కూడా అలోవెరా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. రోజుకు రెండు టేబుల్‌ స్పూన్ల అలోవెరా జ్యూస్‌ తాగితే బిపి, డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటాయి. ఈ విషయంలో డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది. చర్మం తెగినా, మండినా, కాలినా, వాపు వచ్చినా, కందినా, పొడిబారినా.. ఆ ప్రదేశంలో అలోవెరా గుజ్జును రాస్తే క్షణాల్లో ఫలితం కనిపిస్తుంది. గుజ్జును రాసిన తర్వాత ఆ ప్రదేశం గట్టిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. కారణం అలోవెరా జ్యూస్‌ అక్కడి చర్మ కణాలకు ఎనర్జీ ఇస్తుంది. కలబందలోని పోషకాలు, ఎంజైములు, అమైనో యాసిడ్లు, ఖనిజాలు అధిక బరువును తగ్గించేవే. ప్రతి రోజూ గ్లాసు నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తాగితే కడుపులోని కొవ్వు, చెడు పదార్థాలు, పేగులకు అంటుకుపోయే ఆయిల్‌ వంటివన్నీ మొత్తం క్లీన్‌ అయిపోతాయి. ఉత్తి జ్యూస్‌ తాగలేమనుకునేవారు అందులో కాస్త నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకోవచ్చు.

➡️