పొలిటికల్‌ సెటైర్‌ కాదు : హీరో శ్రీకాంత్‌

Nov 22,2023 19:20 #Hero Srikanth, #movie, #Political, #Satire

రాహుల్‌ విజయ్, శివాని రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈనెల 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్‌ మీడియా మిత్రులతో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే…’ఇదొక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌. ఎక్కడైనా పోలీసులు క్రిమినల్స్‌ని చేజ్‌ చేసి పట్టుకుంటారు. కానీ ఇందులో పోలీస్‌ చేజెస్‌ పోలీస్‌ కథ. పొలిటీషన్స్‌ పోలీసులను ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. ఓటు బ్యాంకింగ్‌ కోసం కులాలు, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇందులో స్పష్టంగా చూపించారు. వ్యవస్థలో జరిగేది మాత్రమే చూపించారు.. కానీ పొలిటికల్‌ గా ఎలాంటి సెటైర్‌ ఉండదు. శ్రీకాకుళం బ్యాక్‌ డ్రాప్‌లో కథ ఉంటుంది. స్టోరీ, స్క్రీన్‌ ప్లే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సినిమా ఎక్కడా బోర్‌ కొట్టనివ్వదు’ అని వివరించారు.

➡️