సూపర్‌ లార్జ్‌ రాకెట్‌ లాంచర్లతో ఉత్తర కొరియా విన్యాసాలు

  •  వీక్షించిన అధ్యక్షుడు కిమ్‌

ప్యాంగాంగ్‌ : ఉత్తర కొరియా కొత్తగా సమకూర్చుకున్న ‘సూపర్‌ లార్జ్‌’ రాకెట్‌ లాంచర్లతో జరిపిన విన్యాసాలను ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ పర్యవేక్షించారు. గత రెండు మాసాల వ్యవధిలో ఉత్తర కొరియా అనేక స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాల గురించి దక్షిణ కొరియా, జపాన్‌లు వెల్లడించాయి. 23 అంగుళాల బహుళ రాకెట్‌ లాంచర్లతో ‘వాస్తవ యుద్ధ సామర్ధ్యాలను’ పరీక్షించేందుకు ఈ విన్యాసాలు ఉద్దేశించబడినట్లు అధికార కొరియన్‌ సెంట్రల్‌ వార్తా సంస్థ (కెసిఎన్‌ఎ) తెలిపింది. లక్ష్యానికి మించి ముందుగానే నిర్దేశించుకున్న ఎత్తులో ఒక శతఘ్నిని గాల్లోనే పేల్చడాన్ని అనుకరించడం వంటివి ఈ విన్యాసాల్లో వున్నాయి. ఉత్తర కొరియా మిలటరీని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని కిమ్‌భావిస్తున్నారు. ఆ దిశగా ఇటీవలి కాలంలో తన చర్యలను ముమ్మరం చేశారు. ఈ రాకెట్‌ లాంచర్లతో యుద్ధ సన్నాహాల్లో కీలకమైన దాడుల ప్రయోగాలను చేస్తున్నట్లు తెలిపారు.

➡️