నిఫ్టీ @21వేలు

Dec 8,2023 22:25 #Business
nifty today

ముంబయి : ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ తొలిసారి 21 మార్క్‌ను తాకింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో వారాంతంలో సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. శుక్రవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 304 పాయింట్లు పెరిగి 69,826 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ 68 పాయింట్లు పెరిగి 20,969కి చేరింది. ఉదయం 20,934 వద్ద ప్రారంభమైన సూచీ.. ఓ దశలో 21,006.10 వద్ద ఆల్‌టైం గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. సెన్సెక్స్‌-30లో హెచ్‌సిఎల్‌ టెక్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, టైటన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తదితర సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.

➡️