వార్తాపత్రిక

Dec 8,2023 10:14 #Jeevana Stories

తెల్లా తెలవారిందివార్తాపత్రిక వచ్చిందినాన్నకు తెచ్చి ఇచ్చానుఅమ్మ కాఫీ ఇచ్చింది!నాన్నకు పెన్సిలు ఇచ్చానునన్ను చూసి నవ్వాడునా భావం గ్రహియించాడుచిన్నగ నా బుగ్గ చిదిమాడు!జాతీయ, రాష్ట్ర వార్తలుప్రాంతీయ వార్తలుముఖ్యమైన వార్తలుటిక్కులు పెట్టి ఇచ్చాడు!నాన్న పేపరు చదివాకానేటివార్తల పుస్తకం తీసానుతేదీ వేసి అన్నింటినివరుసలో రాసుకున్నాను!పాఠశాలకు వచ్చానుటీచర్‌ గారికి చూపించానుమేడం తప్పులు దిద్దారుఎలా చదవాలో చెప్పారు!ప్రార్థన సమయం వచ్చిందిటీచర్‌ నన్ను పిలిచారురాసిన వార్తలు చదివానురోజూ రాసుకురమ్మన్నారు!టీచర్‌ ఎస్‌.పి.ఎల్‌ ని పిలిచారుబోర్డు మీద రాయించారుప్రార్ధనకు రాలేని పిల్లలుఇంటర్వెల్‌లో చదివారు!ఇంట్లో నాన్నకు చెప్పానుమంచిపని అని మెచ్చాడుఏ ఉద్యోగం చేస్తావన్నారు?న్యూస్‌ రీడర్‌ అవుతానన్నాను!రిపబ్లిక్‌ డే వచ్చిందిక్విజ్‌ పోటీలు పెట్టారుమొదటి బహుమతి వచ్చిందిఅందరూ అభినందించారు !

– కొత్తపల్లి ఉదయబాబు,94418 60161

➡️