మూడో టీ20లో బంగ్లాపై న్యూజిలాండ్‌ విజయం..

Dec 31,2023 12:53 #Cricket, #Newzland, #T20
  •  డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో గెలిచిన కివిస్‌

మౌంట్‌ మంగ్‌నూరు వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) న్యూజిలాండ్‌ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో న్యూజిలాండ్‌ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. 110 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్య సర్కార్‌ (4), రోనీ తాలుక్దార్‌ (10), నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (17), తౌహిద్‌ హదరు(16), అఫీఫ్‌ హొస్సేన్‌ (14), షమీమ్‌ హొస్సేన్‌ (9), మహేదీ హసన్‌ (4), షోరిఫుల్‌ ఇస్లాం (4), రిషద్‌ హొస్సేన్‌ (10), ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ (3), తన్వీర్‌ ఇస్లాం (8) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మిచెల్‌ శాంట్నర్‌ 4 వికెట్లు తీయగా.. సౌథీ, మిల్నే, సీర్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో ఫిన్‌ అలెన్‌(38), జేమ్స్‌ నీషమ్‌(28), మిచెల్‌ సాంట్నర్‌ (18) రాణించారు. మిగాతా బ్యాటర్లు టిమ్‌ సీఫెర్ట్‌ (1), డారిల్‌ మిచెల్‌(1), గ్లెన్‌ ఫిలిప్స్‌(1), మార్క్‌ చాప్‌మన్‌(1) పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ 95/5(14.4 ఓవర్లు) వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గే సూచనలు కన్పించకపోవడంతో మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి 17 పరుగుల అధిక్యంలో ఉన్న కివీస్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్‌, షోర్‌ఫుల్‌ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టీ20లో బంగ్లాదేశ్‌ విజయం సాధించగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.

➡️