ఘనంగా నూతన సంవత్సర వేడుకలు 

Jan 1,2024 14:55 #Konaseema
new year celebrations

ప్రజాశక్తి – కపిలేశ్వరపురం : కపిలేశ్వరపురం మండల గ్రామాల్లో సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ,వైసీపీ నాయకులు జెడ్పిటిసి సభ్యులు సభ్యులు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ (అబ్బు)కు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు కు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రముఖ నాయకులకు, పెద్ద ఎత్తున ఆయా పార్టీల శ్రేణులు, అభిమానులు పలువురు హాజరై స్వీట్లు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. వారి నివాసాల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద న్యూ ఇయర్ కేకును కట్ చేసి కేకులు, స్వీట్లును అందజేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

➡️