ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన నేచురల్‌ స్టార్‌ నాని

దసరా, హాయ్నాన్నలతో పాన్‌ ఇండియా విజయాల్ని ఆస్వాదిస్తున్న నేచురల్‌ స్టార్‌ నాని వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్‌ ఇండియా చిత్రం.. సరిపోదా శనివార్ణం తో వస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి హై బడ్జెట్‌తో హ్యుజ్‌ కాన్వాస్‌పై ఈ యూనిక్‌ అడ్రినలిన్‌ ఫిల్డ్‌ అడ్వంచర్‌ని నిర్మిస్తున్నారు.ఇంతకుముందు విడుదల చేసిన టీజర్‌కు చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ రోజు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ నాని, సాయి కుమార్‌లతో కూడిన బ్రాండ్‌ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉగాది రోజున ఇది పర్ఫెక్ట్‌ పోస్టర్‌. సూర్యగా నాని, శంకరంగా సాయి కుమార్‌ ఇద్దరూ ఎథ్నిక్‌ వేర్‌లో చిరునవ్వుతో కనిపించారు. పోస్టర్‌లో మనం నిజంగా ఒక పండగ వాతావరణాన్ని చూడవచ్చు. ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి జి డీవోపీగా చేస్తుండగా, జేక్స్‌ బిజోరు సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్‌ ఎడిటర్‌. ఈ పాన్‌ ఇండియా చిత్రం ఆగస్ట్‌ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

➡️