బిగ్‌ బితో పనిచేయడం నా కల

Dec 4,2023 20:22 #movies

‘నేను చనిపోయేలోపు ఒక్క సినిమా అయినా బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో చేయాలన్నది నా కల. అమితాబ్‌ సినిమాలను చూసి నేను చాలా నేర్చుకున్నా. అందుకే ఆయనతో కలిసి చేయాలనేది నా కల. అది కూడా ఆయన విలన్‌ పాత్రలలో మాత్రమే చేయాలి. బిగ్‌ బితో సినిమా తీసినా .. ఆయన మూవీలో నటించినా.. పెద్ద గౌరవంగా భావిస్తా’ అని ప్రశాంత్‌ నీల్‌ అంటున్నారు. ప్రభాస్‌ హీరోగా త్వరలో ఆయన తెరకెక్కించిన ‘సలార్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్‌ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్‌ తన డ్రీమ్‌ గురించి తెలిపారు.

➡️