కదిలిరా…! సభకు భారీ ఏర్పాట్లు

Feb 14,2024 22:15

– లక్షన్నర మందితో భారీ సభా ఏర్పాట్లు
– ఈ సభ బాపట్ల జిల్లాలో నూతన అధ్యాయం
– రా కదలిరాతో వైసిపి ప్రభుత్వ పతనం
– జిల్లాలో అన్ని స్థానాల్లోనూ ఘనవిజయం సాధిస్తాం
– టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి
ప్రజాశక్తి – మార్టూరు రూరల్
మాజీ సిఎం, టిడిపి అధినేత ఇంకొల్లులో నిర్వహించనున్న రా.. కదలిరా సభ బాపట్ల జిల్లాలో నూతన అధ్యాయం సృష్టించనున్నదని బాపట్ల పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఈనెల 17న బాపట్ల పార్లమెంట్ పరిధిలో కదలిరా బహిరంగ సభ ఇంకొల్లులో నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక పాలనను సాగనంపేందుకు టిడిపి అధినేత చంద్రబాబు రా కదలిరా సభతో శంఖారావం పూరిస్తున్నారని అన్నారు. వైసిపి దౌర్జన్యాలు, అరాచకాలను ఎండ కట్టేందుకు ప్రజలను చైతన్యం చేసేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్నారని అన్నారు. వైసిపి దౌర్జన్యాలు ధమనకాండను ఎదుర్కొంటూ బాపట్ల జిల్లాలో టిడిపి మహాశక్తిగా ఆవిర్భవించిందని అన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. సభకు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి లక్షన్నరుకుపైగా ప్రజలు హాజరవుతారని అన్నారు. ప్రజా సంక్షేమం విస్మరించి, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని కోరారు. ఈ సభతో వైసిపి ప్రభుత్వ పతనానికి నాంది పలకాలని అన్నారు.
బాపట్ల జిల్లా క్లీన్ స్వీప్
ప్రస్తుతం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నాయకత్వంలో బాపట్ల జిల్లాలో టిడిపి పట్టిష్టంగా ఉందని, రానున్న ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో టిడిపి ఘన విజయంతో క్లీన్ స్వీప్ సాధించడం ఖాయమని పోలీట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలో టిడిపి అభివృద్ధికి ఎమ్మెల్యే ఏలూరి కృషి అభినందనీయమని అన్నారు. వైసిపి దౌర్జన్యాలకు బెదరకుండా అక్రమ కేసులకు భయపడకుండా దీటుగా ఎదుర్కొని జిల్లాను అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. రానున్న టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఏలూరి కీలక స్థానం పొందుతారని అన్నారు. ఇంకొల్లు సభతో బాపట్ల జిల్లా దశ దిశ మారనుందని, ప్రజలంతా రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు వెంట నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బీఎన్ విజయ్ కుమార్, బాపట్ల ఇంచార్జ్ నరేంద్ర వర్మ, జనసేన ఇంచార్జ్ విజయకుమార్, చీరాల ఇంచార్జ్ కుమారుడు ఎం అమర్నాథ్, టిడిపి రాష్ట్ర నాయకులు చిట్టి, వేములకొండ శ్రీనివాస్, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దయా బాబు, గునుగుంట్ల కోటేశ్వరరావు, తాత జయ ప్రకాష్, పిల్లి మాణిక్యరావు, సజ్జ హేమలత పాల్గొన్నారు.

పర్చూరు : ఈనెల 17న ఇంకొల్లులో రా కదలిరా తారకరామా విజయభేరీ ప్రాంగణంలో జరిగే చంద్రబాబు సభను జయప్రదం చేయాలని టిడిపి మండల అధ్యక్షుడు ఎస్‌కె సంశుద్దీన్ కోరారు. స్థానిక టిడిపి కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విధానాన్ని ఎండగట్టేందుకు ప్రజలంతా ఏకం కావాలని కోరారు. సమావేశంలో ఎవి కృష్ణ, మానవ హరిబాబు, కొండ్రకంటి శివ, సిరిగిరి శివ నాగేశ్వరరావు, శ్రీరామ్ వెంకట సుబ్బారావు, చెరుకూరి శ్రీధర్, కొరిటాల సురేషు, కొల్లా శ్రీనివాసరావు, ఎల్ సుమన్, సిరిగిరి నాగేశ్వరరావు, కొల్లా బుల్లిబాబు పాల్గొన్నారు.

➡️