మధ్యప్రదేశ్‌ సిఎంగా మోహన్‌ యాదవ్‌

Dec 12,2023 10:27 #cm, #Madhya Pradesh, #Mohan Yadav

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మాజీ మంత్రి మోహన్‌ యాదవ్‌ను బిజెపి ఎట్టకేలకు ఖరారు చేసింది. సోమవారం నాడిక్కడ బిజెపి లెజిస్లేచర్‌ పార్టీ సమావేశమై ఆయనను తమ లెజిస్లేచర్‌ పార్టీ నాయకునిగా లాంఛనంగా ఎన్నుకుంది. ఉజ్జయిని దక్షిణ ఎమ్మెల్యే మోహన్‌ యాదవ్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మధ్యప్రదేశ్‌ 19వ ముఖ్యమంత్రిగా మోహన్‌ యాదవ్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా సీనియర్‌ ఎమ్మెల్యేలు జగదీష్‌ దేవా, రాజేంద్ర శుక్లాల పేర్లను ఖరారు బిజెపి ఖరారు చేసింది. అయితే అధికారంగా ఇంకా ప్రకటించలేదు. సోమవారం జరిగిన సమావేశంలో మోహన్‌ యాదవ్‌ పేరును ప్రస్తుత సిఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రతిపాదించారు. మోహన్‌ యాదవ్‌ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌ టూరిజం శాఖ మంత్రిగా 2013 నుంచి 2018 వరకూ బాధ్యతలు నిర్వహించారు. ఆరెస్సెస్‌కు నమ్మిన బంటుగా ఆయనపై ముద్ర ఉంది.

➡️