మోడీ ప్రభుత్వం రైతులకు శాపం : మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం.. రైతలకు శాపమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. రైతులపై కర్కశంగా రబ్బరు బుల్లెట్లను ప్రయోగించింది. ఈ బుల్లెట్ల కారణంగా ఓ రైతు ముగ్గురు కంటి చూపు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే ‘దేశానికి అన్నం పెట్టే రైతులకు మోడీ ప్రభుత్వం శాపం. మోడీ నిరంతరం అబద్ధాల హామీలిస్తూనే ఉన్నారు. మోడీ అబద్ధాల హామీల కారణంగా రైతు ఉద్యమంలో తొలుత 750 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న శుక్రవారం రబ్బరు బుల్లెట్ల కారణంగా ఒకరు మృతి చెందారు. ముగ్గురు కంటిచూపు కోల్పోయారు. మోడీ ప్రభుత్వం రైతులను శత్రువుల్లా చూస్తోది. కాంగ్రెస్‌ మాత్రమే వారికి చట్టబద్ధమైన ఎంఎస్‌పి హక్కు ఇస్తుంది.’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

➡️