మిజోరాంలో మెజారిటీ దిశగా  జెడ్‌పిఎం 

Dec 4,2023 11:12 #Assembly Elections, #Mizoram

 

ఐజ్వాల్‌   :  మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) వెనుకబడింది. ఆరు పార్టీల కూమితో కూడిన జోరమ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌ పిఎం) మెజారిటీలో కొనసాగుతోంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను జెడ్‌పిఎం 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఎన్‌ఎఫ్‌ తొమ్మిది స్థానాలు, బిజెపి మూడు, కాంగ్రెస్‌ ఓ స్థానంలో కొనసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఆప్‌ కూడా పోటీ చేయగా, 17 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు.

 

మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్‌.. ఆధిక్యంలో జెడ్‌పిఎం

 ఐజ్వాల్‌ :    మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా, మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. అనంతరం ఇవిఎం ఓట్లను లెక్కింపు ప్రారంభించారు. ఇప్పటివరకు కొనసాగిన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పిఎం) పార్టీ 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) 8 స్థానాల్లో, బిజెపి 3, కాంగ్రెస్‌ 1 స్థానంలో కొనసాగుతున్నాయి.

రాష్ట్రంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో నవంబర్‌ 7న పోలింగ్‌ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 80.43 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, వివిధ పార్టీలకు చెందిన 16 మంది మహిళలు సహా 174 మంది పోటీ చేశారు. మిజోరంలో పాలక మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) మరోసారి ఆధిక్యంలో నిలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనావేశాయి.

➡️