‘మిషన్‌ దివ్యాస్త్ర’ సక్సెస్‌

Mar 11,2024 21:58 #'Mission Divyastra', #Agni-1, #Success

ఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ‘మిషన్‌ దివ్యాస్త్ర పేరుతో.. బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 (ఎంఐఆర్‌ వి) క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌ వి) సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీనిద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్‌హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. ఆసియా యావత్తూ దీని పరిధిలోకి వస్తుంది. అగ్ని-5 విజయవంతంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తంచేశారు. డిఆర్‌డిఒ శాస్త్రవేత్తలకు ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-5’కి.. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని ఇవి చేరుకోగలవు. అవన్నీ మన రక్షణ బలగాలకు అందుబాటులోకి వచ్చాయి.

➡️