భద్రతాదళాల చెక్‌పోస్ట్‌పై దాడి .. ముగ్గురి మృతదేహాలు లభ్యం

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రాంతంలోని భద్రతా దళాల చెక్‌పోస్ట్‌పై గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో మరణించిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.  మంగళవారం జరిగిన  ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరికి గాయాలైనట్లు సంగతి తెలిసిందే.

దక్షిణ వజీరిస్థాన్‌ సరిహద్దులోని దిఖాన్‌ జిల్లాలోని అబా షహీద్‌ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు మంగళవారం దాడి జరిగినట్లు తెలిపారు.  ఇద్దరు కార్మికులు, ఓ సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందగా, మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారని అన్నారు.  బుధవారం చేపట్టిన సెర్చ్‌ ఆపరేషన్‌లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయని, గాయపడిన ఇద్దరు కార్మికులను డేరా జిల్లా ఆస్పత్రికి  తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి బాధ్యులమని ఏ సంస్థ ప్రకటన విడుదల చేయలేదు.

అధికారిక సమాచారం ప్రకారం.. 2023లోనే ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో 300 కంటే ఎక్కువ దాడులు జరిగాయి. దాడుల్లో అధిక భాగం నిషేధిత టిటిపి జరిపినట్లు అధికారులు పేర్కొన్నారు.

➡️