వలస బాట

Feb 18,2024 13:37 #Poetry

రెక్కలు ముక్కలు

చేసుకోవాలి

చెమట బిందువులు

పారించాలి

కూలీనాలి దొరకనప్పుడు

పస్తులుండాలి

కుళాయి నీళ్ల కోసం

కొట్టుకు చావాలి

మురికి కూపంతో

సావాసం చేయాలి

పని పాటల కోసం

ఎదురు చూడాలి

దినసరి భత్యం కోసం

దేవుళ్లాడాలి

ఎంత దూరమైన

పని కోసం వెళ్లి తీరాలి

ఎంతటి కష్టమైన

చేసి తీరాలి

మాయదారి

బతుకులంటూ వగచాలి

మా ‘నుదిటి రాతలు’

ఇంతేనని సరిపెట్టుకోవాలి

గుప్పెడు మెతుకుల కోసం

వలస బాట పట్టాలి

నేటి పాలకుల ‘పుణ్య’మిది.

 

  • గాదిరాజు రంగరాజు /న్యూ జెర్సీ నుండి/
➡️