విద్యార్ధుల్లో సూక్ష్మ సృజనాత్మకత అవసరం

Dec 24,2023 00:03

ప్రజాశక్తి – బాపట్ల
విద్యార్థులు సూక్ష్మ మైన సృజనాత్మకతను అలవర్చుకోవాలని విద్యా శాఖ అధికారి పివిజె రామారావు అన్నారు. పురపాలక ఉన్నత పాఠశాల్లో జిల్లా స్థాయి సైన్స్‌ ప్రదర్శనలో విజేతలకు బహుమతి శనివారం అందజేశారు. విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు. విద్యార్థులు సైన్సు పట్ల ఆసక్తి కనబర్చాలని అన్నారు. గణితమేళా, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులు ఉత్సాహంగా నైపుణ్యాన్ని కనబడటం గర్వకారణమని అన్నారు. విజేతల వివరాలను జిల్లా సైన్స్ అధికారి సాదిక్ మాస్టారు ప్రకటించారు. జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన 75ప్రదర్శనల్లో వ్యక్తిగత విభాగంలో ఈపురుపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాల రైన్ వాటర్ హార్వెస్టింగ్, తిమ్మాయిపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాల సెక్యూరిటీ సిస్టం, బోదవాడ జెడ్‌పి ఉన్నత పాఠశాల అండర్ పాస్టన్నల్, సమూహ విభాగంలో గుళ్ళపల్లి జెడ్‌పి ఉన్నత పాఠశాల ఫీచర్ నీడ్స్ టు ఫ్యూచర్, కొల్లూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, మేదరమెట్ల జెడ్‌పి ఉన్నత పాఠశాల మిడ్ డే మీల్ ప్రోగ్రాం, ఉపాధ్యాయ కేటగిరిలో కె పోతురాజు జెడ్‌పి ఉన్నత పాఠశాల ఈజీ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ మోడల్, పెద అంబడిపూడి జెడ్‌పి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు డి స్వర్ణలత మ్యాథమెటిక్స్ ఇన్ నాడు నేడు, పాఠశాల విభాగంలో ఇంకొల్లు ఎన్ఆర్ అండ్ విఎస్ఆర్ హై స్కూల్ కళలతో విజ్ఞానం విజేతలుగా నిలిచాయని తెలిపారు. ఈనెల 28, 29తేదీల్లో కడపలో జరిగే రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విజేతలు పాల్గొంటారని తెలిపారు. విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటి డిఇఒలు ఆర్ శ్రీనివాసులు, జి వెంకటేశ్వర్లు, ఎంఈఒ2 డి ప్రసాదరావు, హెచ్ఎం రాజశ్రీ, సైన్స్ కో ఆర్డినేటర్ పవని భానుచంద్రమూర్తి , ఎ శ్రీనివాసరావు, సికిందర్, మీర్జాన్ పాల్గొన్నారు.

➡️