విస్తృతంగా వైద్యసేవలు

Nov 23,2023 00:06

ప్రజాశక్తి – పంగులూరు
ఉప వైద్య కేంద్రం ద్వారా ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మండలంలోని అలవలపాడు సబ్ సెంటర్ ఎఎన్ఎం పాలపర్తి శకుంతల, ఎంఎల్‌హెచ్‌పి సిహెచ్ మార్తమ్మ తెలిపారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఉప వైద్య కేంద్రాన్ని బుధవారం “ప్రజాశక్తి” పరిశీలించిన సందర్భంగా సబ్ సెంటర్ ద్వారా చేస్తున్న సేవలను వివరించారు. సచివాలయం పరిధిలో 3,142మంది జనాభా ఉండగా, అందులో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలు 342మంది, గర్భిణీలు 42 మంది, బాలింతలు 34మంది ఉన్నారని తెలిపారు. ప్రజలు ఇప్పుడిప్పుడే సబ్ సెంటర్‌కు అలవాటు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 25 నుండి 30 వరకు ఓపి వస్తుందని తెలిపారు.సీజనల్ వ్యాధులు అదుపులో ఉన్నాయని తెలిపారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మొదలైన ఇబ్బందులు ఉన్నవాళ్లు నిరంతరం వస్తుంటారని తెలిపారు. గ్రామంలో డెంగ్యూ వ్యాధి రాలేదని చెప్పారు. ప్రతిరోజు సబ్ సెంటర్‌కు గర్భవతులు, బాలింతలు, పిల్లలు, వృద్దులు, బిపి, షుగర్ ఉన్నవాళ్లు వస్తారని తెలిపారు. 104 వాహనం వచ్చినప్పుడు వందకుపైగా ఓపీలు వస్తాయని చెప్పారు. సబ్ సెంటర్లో బీపీ, షుగర్, హెచ్‌బీ పరీక్షలు, గర్భవతులకు సిఫలిస్, హెచ్‌బిఎస్ వంటి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. సబ్ సెంటర్లో మలేరియా, డెంగ్యూ, మొదలైన వ్యాధులకు సంబంధించిన కిట్స్‌ ఉన్నాయని తెలిపారు. ఎవరైనా ఆ వ్యాధులు ఉంటే సబ్ సెంటర్‌కు వచ్చి పరీక్ష చేయించుకోవచ్చని కోరారు. వీటితోపాటు హెచ్ఐవి, కోవిడ్ పరీక్షలు కూడా చేస్తున్నామని తెలిపారు. గర్భవతులు, ఐదు సంవత్సరాల్లో పిల్లలకు, 10సంవత్సరాల పిల్లలకు, 16సంవత్సరాల పిల్లలకు నెలలో 4బుధవారాలు, 4శనివారాలు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నామని అన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి, నెలకు రెండు సార్లు వీహెచ్ఎన్‌డీ ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని నాలుగు పాఠశాలల్లో మూడు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేసి, బలహీనంగా ఉన్న విద్యార్థులకు ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్నామని అన్నారు. ప్రతి గురువారం విద్యార్థులకు విప్స్ ప్రోగ్రాం చేస్తున్నామని చెప్పారు. ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులకు నులిపురుగులు టాబ్లెట్లు మింగిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి సోమ, గురువారాల్లో ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు ఐరన్ సిరప్ వేస్తున్నామని చెప్పారు. ఈ – సంజీవని ద్వారా పేషెంట్లకు వారి వ్యాధి పట్ల డాక్టర్స్ కు ఫోన్ చేసి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం ఆయుష్మాన్ భారతి కింద గ్రామంలోని ఏదో ఒక ప్రదేశంలో ప్రజలకు ఆరోగ్య సంబంధ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సబ్ సెంటర్లో ఆశా కార్యకర్తలు బి అరుణ, జె సువార్త, ఎం విజయలక్ష్మి పనిచేస్తున్నారు.

➡️