ఐపీఎల్‌ హిస్టరీలో తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా మయాంక్‌ సంచలన రికార్డు

Apr 3,2024 10:53 #2024 ipl, #Cricket, #Sports

అరంగేట్రంలోనే తన స్పీడ్‌ పవర్‌తో సత్తా చాటిన 21 ఏళ్ల ఫాస్ట్‌ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మూడుసార్లు 155 KMPH స్పీడ్‌తో బౌలింగ్‌ చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు మొత్తంగా 48 బంతులు మాత్రమే వేసి ఈ ఘనత సాధించడం విశేషం. ఇక కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే రెండుసార్లు గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేశారు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్‌ ఫాస్టెస్ట్‌ డెలివరీల విషయానికి వస్తే.. మయాంక్‌ యాదవ్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌-2011లో షాన్‌ టైట్‌ 157.7 KMPH వేగంతో బౌలింగ్‌ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్‌లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేసిన టాప్‌-5 బౌలర్లు
1. షాన్‌ టైట్‌- 157.7 KMPH
2. లాకీ ఫెర్గూసన్‌- 157.3 KMPH
3. ఉమ్రాన్‌ మాలిక్‌- 157 KMPH
4. మయాంక్‌ యాదవ్‌- 156.7 KMPH
5. అన్రిచ్‌ నోర్జే- 156.2 KMPH.

➡️