సుఖసంతోషాలతో వర్ధిల్లాలి: కలెక్టర్‌

Apr 9,2024 23:16
జిల్లాలో మంగళవారం ఉగాది

ప్రజాశక్తి – యంత్రాంగం

జిల్లాలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్‌, ఎస్‌పిలతోపాటు, వివిధ రాజకీయ పార్టీలు, సంస్థల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కాకినాడ జిల్లా ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరి యాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆకాంక్షించారు. మంగళవారం స్థానిక సూర్యకళా మందిరంలో జిల్లా సాంస్తృతిక మండలి, సమాచార, పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్‌పి ఎస్‌.సతీష్‌కుమార్‌ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. పసుపులేటి వెంకటరమణ బృందం మంగళనాద స్వర నాదం అనంతరం వేద పండితులు కప్ప గంతుల చంద్రశేఖరశాస్త్రి, బులుసు అయ్యప్పశాస్త్రి, కందాళం సూర్యనారాయణశాస్త్రి, కొండూరి ఆంజనేయశాస్త్రి వేద గానం చేసి అతిధులకు ఆశీర్వచనం పలికారు. తదుపరి వక్కలంక రామకృష్ణమ్మ సిద్ధాంతి సాంప్రదాయ పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించి కొత్త సంవత్సరంలో ఉండబోయే దేశ కాలమాన పరిస్థితులు, నవ నాయక, కందాక ఫలాలు, వర్షాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పరిపాలన తదితర రంగాలో ప్రగతి, రాశి ఫలాలపై వివరిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లా డుతూ తెలుగు ప్రజల సంస్తృతి, సంప్రదాయాలకు ప్రతీక, తొలి పండగ ఉగాది అని శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలం దరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిబింబం ఉగాది పండగ అని అన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అలరించిన సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు

ఉగాది వేడుకల్లో గీతం స్కూల్‌ పాఠశాల విద్యార్ధిని ఎం.శ్రీకరణి, సెయింట్‌ పిఎస్‌ఎంసి గర్ల్స్‌ హైస్కూల్‌ విద్యార్థినులు ఎం.నీహారిక, ఎం.నిరుపమ చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కొరుప్రోలు గౌరినాయుడు ఆధ్వర్యంలో కవులు మార్ని జానకిరామ చౌదరి, అద్దేపల్లి జ్యోతి, కొత్త అప్పారావు, దొండపాటి నాగ జ్యోతి, పిఎన్‌విఎస్‌.ఇందిర, మాకినీడి సూర్యభాస్కర్‌, ర్యాలి ప్రసాద్‌ నిర్వహించిన వసంత కవితాగానం ప్రేక్షకులను అలరించింది. అలాగే తలారి ఆనంద్‌, అజరు బృందం సంగీత విభావరి ఆకట్టుకుంది.వేద పండితులు, కవులకు సత్కారంఉగాది వేడుకల్లో భాగంగా జిల్లా సాంస్కృతిక మండలి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేద, పంచాంగ పండితులు, అర్చక స్వాములు, కవులు, కళాకారులకు కలెక్టర్‌, ఎస్‌పి చేతులు మీదుగా సత్కరించి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా రంగాలకు వారందిస్తున్న సేవలను ప్రశం సించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ జె.వెం కటరావు, జిల్లా దేవాదాయ అధికారి పి.నారాయణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జె.నరసింహనాయక్‌, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, సమాచార, పౌర సంబంధాల శాఖ డిడి డి.నాగార్జున, ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి శ్రీనివాస్‌రావు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ సి.బాబూరావు, పౌర సరఫరాల శాఖ డిఎం బాల సరస్వతి, జడ్‌పి డిప్యూటీ సిఇఒ జి.రాంగోపాల్‌, డిప్యూటీ డిఇఒ ఆర్‌జె.డేనియల్‌రాజు తదితరులు పాల్గొ న్నారు. అలాగే కాకినాడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు పీతల అచ్యుత రామారావు ఆధ్వర్యంలో ప్రెస్‌ క్లబ్‌ కార్యాలయంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ జ్యోతిష్యులు సాయి సుబ్బారావు పంచాంగ పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుపే శోభన్‌బాబు, ట్రెజరర్‌ కోనేటి శ్రీనివాసరావు, అడ్వైజరీ కమిటీ వీధి గోపీనాథ్‌, సికోటి త్రిమూర్తులు, జాయింట్‌ సెక్రెటరీ పుర్రె త్రినాథ్‌, మోర్త బాలకుమార్‌ పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌ మండలంలోని ఎపిఐఐసి కాలనీలోని అడబాల ట్రస్ట్‌ కార్యా లయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణం జరిగింది. ఆధ్యాత్మికవేత్త డాక్టర్‌ వేధుల శ్రీరామ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటామని అన్నారు. నేటి నుంచి కొత్త సంవత్సర తిధులతో పంచాంగం ప్రారంభమవుతుందని అన్నారు. ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌. శ్రీనగేష్‌, రాజా, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. అలాగే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురి వృద్ధులకు నూతన వస్త్రాలు, పులిహార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి ఎస్‌.నగేష్‌ మాట్లాడుతూ పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన సంస్తృతి వికాసానికి దోహదం చేస్తా యని అన్నారు.

సామర్లకోట ఉగాది వేడుకలు పురస్కరిం చుకుని పలు ఆలయాల్లో జోరుగా పంచాంగ శ్రవ ణాలు నిర్వహించారు. మాం డవ్య నారాయణ స్వామి ఆలయంలో మండల రైతు సంఘం ఆధ్వ ర్యంలో తాడా హనుమాన్‌ శాస్త్రి పంచాంగ శ్రవణం చేప ట్టారు. అలాగే స్థానిక గ్రామ దేవత నూకాలమ్మ ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అలాగే స్థానిక బళ్ల మార్కెట్లో కనకమహాలక్ష్మి ఆలయంలో పంచాంగ శ్రవణం చేపట్టారు. పెద్దాపురం రోడ్‌లోని స్వయంవరం పార్వతి దేవి ఆలయంలో వసంత నవరాత్రి పూజలు పతంజలి ఆధ్వ ర్యంలో అర్చకులు ఘనంగా ప్రారం భించారు. అన్నవరం రత్న గిరిపై దేవస్థానం అధికారులు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఇఒ కె.రామచంద్రమోహన్‌, చైర్మన్‌ రోహిత్‌ పురోహితుల సమక్షంలోఉగాది నామ పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వివిధ ప్రదేశాల వద్ద ఏర్పాటు చేసిన పలు రకాల పుష్పాలతో అలంకరణలు, కోలాటాలు, భరతనాట్యం సూపరులను ఆకట్టుకున్నాయి.

గండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది పండుగను ఆనంద ఉత్సవాల్లో నిర్వహించుకున్నారు. మండల కేంద్రమైన గండేపల్లి మరిడమ్మ తల్లి ఆలయం వద్ద పంచాంగ శ్రవణం గ్రామ పురోహితుడు సత్తిబాబు చేశారు. అదేవిధంగా మల్లేపల్లి గ్రామంలో ప్రతి మంగళవారం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన రావిపాటి బాబూరావు, మాణిక్యం దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తాళ్ళరేవు మండలం కేశవపురం గ్రామంలోని కేశవ స్వామి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి యర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వేద పండితులు కందికొండ బాబి పంచాంగ పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పిఎస్‌ఆర్‌వి.శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు. అలాగే పాత కోరంగి శివాలయం, తాళ్లరేవు వెంకటేశ్వర స్వామి ఆలయం, పటవల తలుపులమ్మ ఆలయం వద్ద ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాల్లో ప్రజలకు ప్ర సాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక స్వామి, తలైస్వామిలతోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పెద్దాపురం ఉగాది సందర్భంగా  తెలుగు సంవత్సరాది వేడుకలు పెద్దాపురంలో ఘనంగా నిర్వ హించారు. మరిడమ్మ ఆలయంలో ఆలయ అసిస్టెంట్‌ కమి షనర్‌ సిహెచ్‌.రామమోహనరావు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. మున్సిపల్‌ కార్యా లయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆర్‌డిఒ జె.సీతారామారావు, మున్సిపల్‌ కమిషనర్‌ కెవి.పద్మావతి తెలుగు సంస్కృతిలో ఉగాది ప్రాముఖ్యతను వివరించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్‌ ఎంపిడిఒ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. పెద్దాపురం మండలం పులిమేరులోని శాంతి వర్ధన విభిన్న ప్రతిభా వంతుల పాఠశాలలో పాఠశాల డైరెక్టర్‌ రాయవరపు వీర బాబు ఆధ్వర్యంలో విద్యార్థులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

➡️