చెన్నైలో అత్యధిక పోలింగ్‌ స్టేషన్లు

చెన్నై : లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరుగుతోంది. తొలిదశలోనే తమిళనాడులోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌నకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. కాగా రాష్ట్రంలోకెల్ల చెన్నై జిల్లాలో అత్యధిక పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. తమిళనాడు వ్యాప్తంగా 68,321 పోలింగ్‌ స్టేషన్లు ఉంటే చెన్నై జిల్లాలో 3,726 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. చెన్నై తర్వాత 3,687 పోలింగ్‌ స్టేషన్లు ఉన్న తిరువళ్లూర్‌ జిల్లా రెండో స్థానంలో ఉంది. చెంగల్పట్టు (2,825), మదురై 2,751, తిరుచ్చి 2,527, తిరుప్పూర్‌ 2,540, తిరువన్నమలై 2,377, తంజావూర్‌ 2,308, కడలూరు (2,302), ఈరోడ్‌ (2,222), దిండిగల్‌ 2,121, విల్లుపురం 1,966, విరుదునగర్‌ 1,895, కృష్ణగిరి 1,888, కన్యాకుమారి 1,698 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. వెయ్యిలోపు పోలింగ్‌ కేంద్రాలున్న జిల్లాల్లో మైలాడుత్తురై 860 నీలగిరి 689, నాగపట్నం 653, పెరంబలూరు 652, అరియలూర్‌ 596 జిల్లాలు ఉన్నాయి. ఇక లోక్‌సభకు పోలింగ్‌ జరిగే రోజునే కన్యాకుమారి జిల్లాలోని విలవంకోడ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 272 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.

➡️