వరుణ్‌తేజ్‌ బర్త్‌డే స్పెషల్‌ : ‘మట్కా’ గ్లింప్స్‌ రిలీజ్‌

Jan 19,2024 16:11 #Matka Movie, #varun tej

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. శుక్రవారం వరుణ్‌ బర్త్‌డే (జనవరి 19) స్పెషల్‌గా చిత్రయూనిట్‌ గ్లింప్స్‌ని రిలీజ్‌ చేసింది. ఇందులో వరుణ్‌తేజ్‌ ముఖం పూర్తిగా కనిపించలేదు. ఫోన్‌లో మాట్లాడుతూ.. ఎవరికో ప్రామిస్‌ చేసినట్లు కనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో వరుణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్‌ చంద్ర, రవిశంకర్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పలాస 1978 ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజేందర్‌ రెడ్డి తీగల, రజని తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

➡️